నేరేడుపల్లిలో TRP జిల్లా అధ్యక్షుడు పర్యటన
BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ శుక్రవారం ఉదయం భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు, యువకులతో ఆయన సమావేశమై TRP జెండా, ఎజెండా వివరించారు. బీసీ రాజాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీకి మద్దతు తెలపాలని, తీన్మార్ మల్లన్నకు అండగా నిలవాలని వారిని కోరారు.