కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే

E.G: పెదపూడి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను సూపరింటెండెంట్ అనూష, డాక్టర్ వరప్రసాద్ వివరించారు. ఆసుపత్రి సమస్యలపై ఎమ్మెల్యే చర్చించారు.