ఇండస్ట్రియల్ ఏరియాలో ఎస్పీ తనిఖీ
కృష్ణా: బాపులపాడు మండలంలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ.. పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు, దొంగతనాలు, మహిళా ఉద్యోగుల భద్రత, బహిరంగ మద్యపానం వంటి సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. వేధింపులు, దొంగతనాలు, అక్రమ మద్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.