VIDEO: వీధి కుక్కను కాపాడిన వ్యక్తి
KRNL: ఎమ్మిగనూరు ఎంజీ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వీధి కుక్క తల ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక విలవిల్లాడింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ఆ మూగజీవిని గమనించిన స్థానికుడు చాకచక్యంగా వ్యవహరించాడు. కుక్కను శాంతింపజేసి, జాగ్రత్తగా ఆ డబ్బాను తొలగించి ప్రాణాలు కాపాడాడు. సకాలంలో స్పందించిన ఆ జంతు ప్రేమికుడిని స్థానికులు అభినందించారు.