VIDEO: ప్రమాదమని తెలిసినా తప్పదు..!

VIDEO: ప్రమాదమని తెలిసినా తప్పదు..!

NRML: తానుర్ మండలంలోని గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. జారీ( బీ) గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదమని తెలిసినా గ్రామస్తులు తప్పని పరిస్థితుల్లో వాగు దాటి వెళుతున్నారు. వంతెన లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారి గ్రామస్తులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని వాపోయారు.