కలెక్టరేట్ వద్ద మహిళల ఆందోళన

GNTR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తాడేపల్లి మహిళలు ఆందోళన నిర్వహించారు. 17 సంవత్సరాల నుంచి తాడేపల్లిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని అర్జీలు పెట్టినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నామన్నారు.