'సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తా'
BDK: జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుర్స రమేష్ వార్డు సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తానని, గ్రామ ప్రజలు తనకు అండగ నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.