నేరాలను అరికట్టడమే పోలీసుల లక్ష్యం: ఎస్సై
NLR: ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను కాపాడుతూ రోడ్డు ప్రమాదాలు, నేరాలను అరికట్టడమే పోలీసుల లక్ష్యమని వింజమూరు ఎస్సై కె.వీర ప్రతాప్ పేర్కొన్నారు. అందుకే తాము వాహనాల తనిఖీ చేస్తుంటామని తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మండలంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలు మరింత కట్టుదిట్టంగా చేస్తున్నామని వెల్లడించారు.