కాంగ్రెస్ ఎప్పటినుంచో పాక్ పాట పాడుతోంది: మోదీ

కాంగ్రెస్ ఎప్పటినుంచో పాక్ పాట పాడుతోంది: మోదీ

కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌తో సంబంధాలు నెరుపుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. అసోంలో జరిగిన ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న మోదీ దేశ భద్రతపై ప్రతిపక్షం వ్యవహరిస్తోన్న తీరుకు ఇప్పటికే పలుమార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా కాంగ్రెస్ పాక్ పాటే పాడిందన్నారు. ఈ సంబంధం ఇప్పటిది కాదని.. ఎప్పటి నుంచో సాగుతోందని మోదీ పేర్కొన్నారు.