స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్: మాజీ ఎమ్మెల్యే
NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని, ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన వడ్త్యా పద్మ బలరాంను అభినందించి, శాలువాలతో సత్కరించారు.