'స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం'

MBNR: అడ్డాకుల మండలంలోని పెద్ద మునగల్ చెడ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.