పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పరిశీలకుడు
NZB: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్, ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకుడు శ్యాంప్రసాద్ లాల్ మోపాల్, మాక్లూర్, గుండారం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు.