బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

BNR: చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తున్న చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం గ్రామానికి చెందిన వెలిగే నర్సిరెడ్డి (48)ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.