కొల్లిపరలో నీట మునిగిన లంక పొలాలు
GNTR: కృష్ణా నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో కొల్లిపరలోని పరివాహక ప్రాంత లంక పొలాలు నీట మునిగాయి. వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, కొల్లిపర, బొమ్మువానిపాలెం, అన్నవరం గ్రామాల్లోని లంక పొలాలను వరద నీరు చుట్టుముట్టిందని రైతులు తెలిపారు. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో పంట నష్టం జరుగుతుందని అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు.