పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత

పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత

NLR: హొళగుందలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలంటూ సీపీఎం నాయకులు వెంకటేశ్, నాగరాజు బుధవారం మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. వివిధ గ్రామాల నుంచి 1,780 మంది విద్యార్థులు చేరుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యా హక్కు చట్టం ప్రకారం తక్షణమే నియామకాలు చేపట్టాలని కోరారు.