'ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేము'
HYD: కృష్ణానదీ జలాల్లో ఒక్క చుక్కనీరు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన వాటా ప్రకారం కృష్ణా నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటామని, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా నీటి అవసరాల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా బేసిన్‌లో ఎక్కువ పంటసాగు జరిగిందన్నారు.