దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై వినతి

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై వినతి

విశాఖ 65వ వార్డులో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడ, కాలువల పునర్నిర్మాణం, తాగునీటి లైన్ల ఏర్పాటు వంటి అంశాలను మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై మేయర్ సానుకూలంగా స్పందించి త్వరలో వార్డు పర్యటనకు వస్తానని తెలిపారు.