జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

ELR: ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. జనసేన నాయకులు నారా శేషు ఆధ్వర్యంలో 10,000 వినాయక ప్రతిమలు, 10,000 వినాయక వ్రత కల్ప పుస్తకాల పంపిణీ చేశారు. గాలి, నీరు, మరింత కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను వినియోగించాలని కోరారు.