VIDEO: గోషామహల్‌లో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు
HYD: గోషామహల్‌లోని చాక్నవాడిలో 5 అంతస్తుల భవనానికి పగుళ్లు వచ్చాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. గంటలు గడిచినా.. GHMC అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు భవనం లోపల ఉన్న నివాసులను ఖాళీ చేయించారు.