పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు
SRD: కంగ్టి మండలం చాప్ట గ్రామంలో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ సయ్యద్ ముస్తాక్ స్థానిక పశువులకు వైద్య చికిత్సలు చేసి సీజనల్ గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తుగా టీకాలు వేశారు. గాలికుంటు వ్యాధితో పశువులు బలహీనతకు గురవుతాయని, పశుపోషకులు ఆవులు, గేదెలకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు ఇప్పించాలని డాక్టర్ సూచించారు.