భక్తుల సౌకర్యాలను పరిశీలించిన ఈవో
VSP: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంకు వచ్చే భక్తుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యతగా ఆలయ యంత్రాంగం పనిచేస్తోందని ఈవో ఎన్. సుజాత తెలిపారు. శనివారం ఆమె అన్నప్రసాద భవనం, క్యూ లైన్లు, టికెట్ జారీ విభాగం, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. భక్తులకు రుచికరమైన, శుచమైన అన్నప్రసాదం అందించాలని, దర్శన సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.