ఏలూరులో 998 మంది రైతులకు లబ్ధి
ELR: అన్నదాతల శ్రేయస్సే రాష్ట్రానికి క్షేమమని, కూటమి ప్రభుత్వం ఆ దిశగానే పయనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 998 మంది రైతులకు రూ.69.86 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.