పెట్రోల్ బంక్ పనులను పరిశీలించిన అదనపు ఎస్పీ
MDK: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆవుసులపల్లి పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ పనులను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతతో పాటు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.