హజ్ యాత్రికులకు సమగ్ర సదుపాయాలు
GNTR: హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమగ్రంగా కల్పిస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ ఏడాది నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచే యాత్ర ప్రారంభం కావడం ముస్లిం సోదరులకు మరింత సౌకర్యంగా మారిందన్నారు. భోజన, వసతి, ప్రార్థన ఏర్పాట్లతో పాటు ప్రయాణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.