కాగజ్ నగర్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
NRML: కాగజ్‌నగర్ పట్టణంలోని మోసం గ్రామ శివారులో ఉన్న బండల ఒర్రెలో గుర్తు తెలియని వ్యక్తి(50) మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, ఆష్ కలర్ షార్ట్ ధరించి ఉండగా, మెడలో నలుపు దారం, చేతికి కడియం, ఎరుపు, పసుపు దారాలు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు సమీప పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.