లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం

లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం

ATP: జిల్లాలోని రాణీనగర్‌లోని బ్రహ్మంగారి గుడి వద్ద శనివారం మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరిగేవారని అన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టి వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.