VIDEO: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం చలి ప్రభావం వలన భక్తులు ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప దీక్షా పరులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక, ధర్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనుబంధం ఆలయాల్లో కూడా భక్తుల తాకిడి నెలకొంది.