ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

SRD: కంది మండలం బేగంపేట గ్రామంలో ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాలు స్టాక్ బోర్డు, నిల్వలను పరిశీలించారు. ఎక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.