VIDEO: పెనమలూరులో ATAL టింకరింగ్ డే

కృష్ణా: పెనమలూరు ZPHS పాఠశాలలో ATAL టింకరింగ్ డేను సోమవారం నిర్వహించారు. విద్యార్థులు ప్రాయోగిక విద్య, సృజనాత్మక ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించారు. చిన్నారులలో ఆవిష్కరణాత్మక ఆలోచనలు పెంపొందించే దిశగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొత్త ఆలోచనలను రూపుదిద్దుకుని వాటిని ఆచరణలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం విశేషం.