ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలు
BDK: చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గ్రామంలో ఆగి ఉన్న టిప్పర్ లారీని, వేగంగా వచ్చిన మరో టిప్పర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో వెనుక నుంచి ఢీకొట్టిన లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, క్షతగాత్రుడిని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.