అకాల వర్షం.. ఇళ్లు ధ్వంసం

అకాల వర్షం.. ఇళ్లు ధ్వంసం

ASF: బెజ్జూరు మండలంలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం, గాలి దుమారం బీభత్సం సృష్టించింది. కుంటలమానేపల్లి, అందుగులగూడ గ్రామాల్లో పలువురి ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. కుంటలమానేపల్లిలో 15, అందుగులగూడలో ఏడుగురి ఇళ్ల పైకప్పులు గాలిధాటికి లేచిపోయాయి. నైతం విలాస్ ఇంట్లో సరకులు తడిసి, రిఫ్రిజిరేటర్ ధ్వంసమైంది. సిడాం సరోజ ఇంటిపై చెట్టు పడింది.