నెయిల్ పాలిష్.. మహిళలది కాదు, మగవారిదే!

నెయిల్ పాలిష్.. మహిళలది కాదు, మగవారిదే!

ప్రస్తుత కాలంలో మహిళలు అధికంగా వాడే నెయిల్ పాలిష్ మొదట మగవారి కోసమే పుట్టింది. 3500 ఏళ్ల క్రితం బాబిలోనియాలోని పురుష సైనికులు యుద్ధానికి ముందు గోళ్లకు రంగులు వేసుకునేవారు. శత్రువులను బెదిరించడానికి ఇది ఒక ఆనవాయితీగా, వ్యూహంగా ఉండేది. కాలక్రమేణా, ఈ సంప్రదాయం మారిపోయింది. ప్రస్తుతం ఈ నెయిల్ పాలిష్ కేవలం మహిళల అలంకరణగా పరిమితమైపోయింది.