తాడేపల్లిగూడెంలో 'భేటీ పడావో' కార్యక్రమం

తాడేపల్లిగూడెంలో 'భేటీ పడావో' కార్యక్రమం

W.G: సమాజంలో సమానత్వానికి బాలికలు ఉన్నతంగా చదువుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ జి.బేబీ అన్నారు. భేటీ పడావో బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం (M) వీరంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 19 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహాలు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. లేకుంటే శారీరక సమస్యలు వస్తాయన్నారు.