ఉప్పుటేరుపై బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించండి: MLA

ఉప్పుటేరుపై బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించండి: MLA

NLR: ఇందుకూరుపేట(M) సముద్రతీర గ్రామాలైన పల్లిపాళెం, మైపాడు గ్రామాలను అనుసంధానం చేసే పల్లిపాళెం ఉప్పుటేరుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని మంత్రి నిమ్మలను కోవూరు MLA ప్రశాంతి రెడ్డి కోరారు. రూ. 14.60 కోట్ల అంచనా వ్యయంతో మంత్రికి మొమరాండం అందజేశారు. 2021లో నివార్ తుఫాను కారణంగా వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన ధ్వంసం అయిన విషయాన్ని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు.