హోటల్‌పై టాస్క్ ఫోర్స్ దాడి.. వ్యభిచారం గుట్టురట్టు

హోటల్‌పై టాస్క్ ఫోర్స్ దాడి.. వ్యభిచారం గుట్టురట్టు

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రైలుపేటలో ఉన్న హోటల్ సుప్రీం ఇన్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. కొత్తపేట పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.