మానవత్వం చాటుకున్న అనంతపురం పోలీసులు
ATP: అనంతపురం త్రీ టౌన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. లేపాక్షికి చెందిన వెంకటలక్ష్మి (47) అనారోగ్యంతో ఇవాళ తెల్లవారుజామున రైల్వే స్టేషన్‌లో మరణించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న కుమారుడికి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు అండగా నిలిచారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు. వారి మానవత్వాన్ని ఎస్పీ జగదీష్ అభినందించారు.