జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా దశరథ్

NZB: జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా చింతల దశరథ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇదివరకు మెదక్ జిల్లా సబ్ జైల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై ఆయన జిల్లాకు వచ్చారు. ఇప్పటివరకు ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్ నుంచి ఆయన మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.