కొర్లగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMM: కల్లూరు మండలం కొర్లగూడెంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు దళారులపై ఆధారపడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.