VIDEO: ఎస్పీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
సూర్యాపేట: ఎస్పీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ తేజస్, ఎస్పీ నరసింహ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేదని, ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని ఎస్పీ అన్నారు.