అక్రమంగా తరలిస్తున్న 140 లీటర్ల నాటు సారా స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 140 లీటర్ల నాటు సారా స్వాధీనం

కర్నూలు: కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ సమీపంలో, బందర్లపల్లె చెక్‌పోస్టు వద్ద నాటుసారా రవాణాపై తనిఖీలు నిర్వహించి 140 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ వై. జోగేంద్ర తెలిపారు. కొండమనాయునిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ నుండి 80 లీటర్లు, బండ పెద్ద పుల్లయ్య నుంచి 60 లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.