అచ్చంపేటలో విస్తృత నైట్ పెట్రోలింగ్
NGKL: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ గురువారం రాత్రి పట్టణంలో విస్తృతంగా నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, లాడ్జీలను స్వయంగా సందర్శించి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. పెట్రోలింగ్లో ఉన్న సిబ్బందిని తనిఖీ చేసి, వారికి భద్రతా చర్యలపై తగిన దిశానిర్దేశం చేశారు.