'ఐటీడీఏ పీవోపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి'

'ఐటీడీఏ పీవోపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి'

ELR: బుట్టాయగూడెంలొ బుధవారం సీపీఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి తెల్లం.రామకృష్ణ మాట్లాడుతూ.. కుకునూరు మండలానికి చెందిన కూటమి నాయకులతో కలిసి ఐటీడీఏ పీవో రాములు నాయక్ నిర్వాసితుల నుండి పెద్ద ఎత్తున కమిషన్ రూపంలోని దండుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు ఐటీడీఏ పీవోపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.