VIDEO: 'అసత్యాలు రాస్తే లీగల్ చర్యలు తప్పవు'
KDP: వేంపల్లి టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమది వ్యవసాయ కుటుంబమని, ఫ్యాక్టరీలు, బినామీలు లేవని స్పష్టం చేశారు. టీడీపీలో జరుగుతున్న చేరికలు చూసి కొందరు ఉద్దేశపూర్వకంగా విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.