VIDEO: సాగర్‌లో నీటి కుక్కల సందడి

NLG: నాగార్జున సాగర్ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి కుక్కలు దర్శనం ఇచ్చాయి. జలాశయంలో కలియతిరుగుతూ అవి వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో అవి కూడా ఒకటి. శనివారం నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఎదుట ఇవి కనిపించాయి.