బ్యాంకుల మేనేజర్‌లతో సీఐ సమావేశం
AKP: బ్యాంకు మేనేజర్‌లతో సీఐ చంద్రశేఖర్ సోమవారం పోలీస్ స్టేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. సీఐ మాట్లాడుతూ.. ఖాతాల ద్వారా జరిగే అనుమానాస్పద లావాదేవీలను గట్టిగా పర్యవేక్షించాలని, నిస్సహాయుల పేర్లతో అనధికారిక ఖాతాలు తెరవకుండా చూడాలని సూచించారు. బంగారం జమ చేసే వ్యక్తులను సకాలంలో పరిశీలించి, కేవైసీ నిబంధనలు పాటించి అక్రమాలను నివారించాలని తెలిపారు.