పెద్ద ఎక్లరా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్

పెద్ద ఎక్లరా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్

KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా స్వతంత్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వర్షటే నాగ్ నాథ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించే విశ్వాసం వ్యక్తం చేశారు.