ప్రారంభమైన వాసవి మత జయంతి ఉత్సవాలు

వికారాబాదు: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. శుక్రవారం నుంచి తాండూరులో వాసవి మాత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య సంఘం, శ్రీ నగరేశ్వర దేవస్థాన పాలక మండలి, వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య సేవాదళ్, యువజన సంఘం, వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, నగరేశ్వర భజన మండలిల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.