ధర్వేశిపురంలో రేణుకా ఎల్లమ్మకు పూజలు
NLG: కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఇవాళ భక్తులకు ప్రత్యేక అలంకరణలో దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.