యాగంటి కోనేరులో భక్తుల తీరుపై విమర్శలు
NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఆలయ పవిత్ర కోనేరులో కొందరు భక్తులు ఈతలు కొట్టడం, షాంపూలతో స్నానం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు మునకలు మునిగి దర్శనం చేసే పవిత్ర తీర్థాన్ని కొందరు వినోదంగా మార్చుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనేరులో పర్యవేక్షణ లోపం పెరుగుతుండటంతో దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.