జిల్లాలో హోటల్స్, రెస్టారెంట్లపై తనిఖీలు

AKP: పలు హోటల్స్, రెస్టారెంట్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.